వర్షం పడుతుండగా ఇంటివైపు వడివడిగా అడుగులు వేస్తూ
వెళ్తున్నాడు అప్పారావు.
" ఇంతలో అక్కడే ఆగిపో..నీ
ముందున్న చెట్టు పడిపోతుంది" అంటూ ఎవరో అరచినట్టు
అనిపించి
ఆగిపోయాడు.
వెనక
ఎవరూ లేరు కానీ నిజంగానే చెట్టు పడిపోయింది. ఆశ్చర్యపోతూనే ఇంటికి వెళ్ళేందుకు ఆటో
ఎక్కబోతుంటే "వద్దు ఎక్కకు. ఆ ఆటోకి యాక్సిడెంట్
అవుతుంది"
అని వినిపించి ఆగిపోయాడు.
ఇంతలో
మరెవరో ఆ ఆటో మాట్లాడుకున్నారు. అది కదలి కదలగానే కారు వచ్చి కొట్టేసింది.
అప్పారావు
మరింత ఆశ్చర్యపోయి .
"నన్నింతగా
రక్షిస్తున్నావు..ఎవరు నువ్వు?" అని
అడిగాడు.
" నేను అశరీరవాణిని " అంటూ
సమాధానం వచ్చింది.
" నా క్షేమం ఇంత కోరేవాడివి నేను
పెళ్ళి చేసుకుంటున్నప్పుడు ఎక్కడ చచ్చావ్ " అంటూకోపగించుకున్నాడు అప్పారావు.